అటుకులు లో 70% ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు , 30% కొవ్వు ఉంటుంది కాబట్టి ఇది ఉత్తమమైన అల్పాహారం.

మీకు రోజు శక్తి కావాలనుకుంటే, అటుకులు బాగా పనిచేస్తాయి.

గర్భధారణ రక్తహీనత ప్రమాదం ఎక్కువగా ఉన్న మహిళలు సాధారణంగా అటుకులు తినడం మంచిది.

ఒక గిన్నె అటుకులలో నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఐరన్ సక్రమంగా శోషణకు అవసరమైన విటమిన్ సి లభిస్తుంది.

అటుకులను అల్పాహారంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థను మేరుపరుస్తుంది. ఉబ్బరం కలిగించదు.

అటుకులలో ప్రోబయోటిక్ లక్షణాలు ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తుంది.

ఒక కప్పు అటుకులలో దాదాపు 250 కేలరీలు ఉంటాయి, అదే రైస్‌లో 333 కేలరీలు ఉంటాయి.

ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసే గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.

దీని కారణంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు.

అటుకులు తినడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు నియంత్రలో ఉంటాయి.