చలికాలం అంటేనే అనేక అంటువ్యాధులు, ఆరోగ్య సమస్యలు కలిగే సమయం
ఈ కాలంలో సరైన ఆహార నియమాలు పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడక తప్పదు
శీతాకాల మార్కెట్‌లలో విరివిగా దొరికే పచ్చి బఠానీలను నిత్యం తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
పచ్చి బఠానీల్లో ఉండే ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్ రోగనిరోధక శక్తిని బలపరచడమే కాక కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి
పచ్చి బఠానీలు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్‌ను కలిగి ఉండడమే కాక శరీరంలోని చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది
పచ్చి బఠానీలు చర్మాన్ని శుభ్రపరచి, ముఖానికి మెరుపునిస్తాయి. అలాగే చర్మానికి నిగారింపునిస్తాయి
పచ్చి బఠానీల్లో ఉండే పాల్‌మిటోయ్‌లెథనోలమైడ్ (పీఈఏ) అనే పదార్థం అల్జీమర్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది
చలికాలంలో పెదవులు, మడమలు పగిలిపోవడం వంటి పరిస్థితిలో పచ్చి బఠానీలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది