గర్భిణులు చికెన్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గర్భిణులు చికెన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువు పెరుగుదల, అభివృద్ధికి అవసరం అవుతుంది.

చికెన్‌లో ఉండే ప్రొటీన్ బేబీ సెల్స్‌తో పాటు టిష్యూస్ ఏర్పడటానికి సాయం చేస్తాయి.

చికెన్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్ ఏర్పడడంలో కీలకంగా ఉంటుంది.

శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసేందుకు హిమోగ్లోబిన్ బాధ్యత వహిస్తుంది.

గర్భధారణ సమయంలో వచ్చే రక్తహీనతను నివారించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.

చికెన్‌లో విటమిన్ బి12, విటమిన్ ఎ, జింక్‌తో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

ఇవి శిశువు అవయవాలు, కంటి చూపు, రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

చికెన్‌ గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సాయం చేస్తుంది.