యాలకులను స్వీట్లు, టీ, పలు రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు
యాలకుల వాడకం ఆహార రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది
యాలకులు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం
యాలకుల నూనెను ఉపయోగిస్తే అది మచ్చలను తొలగించి మెరిసిపోయేలా చేస్తుంది
యాలకులను గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసుకోవాలని. దానిని తేనెలో మిక్స్ చేసి పెదవులపై రుద్దండి
15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి
ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పెదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి
క్రమం తప్పకుండా యాలకులను తింటే.. అవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడతాయి