అనేక అధ్యయనాలు ‘బ్లూబెర్రీ’ తినడం వల్ల తక్కువ-రక్తపోటు, కొలెస్ట్రాల్ , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

మీరు ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో ఈ పండును తీసుకుంటే, రక్త నాళాలు సడలి గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

బెర్రీ పండ్లలో పుష్కలంగా ఉన్న ఫ్లేవనాయిడ్స్  మెదడు పనితీరును మెరుగుపరచడంలో , మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి.

బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది , దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు.

బెర్రీస్‌లో కేలరీల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడంలో సహాయపడతాయి.

బ్లూబెర్రీస్ విటమిన్ ఎ, సి , ఇలను కలిగి ఉంటాయి, ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

ఈ విటమిన్లు కాలుష్యం , UV కిరణాల నుండి చర్మానికి పూర్తి రక్షణను అందిస్తాయి.

బ్లూబెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదిస్తాయి.