వేసవిలో గొంతు మాత్రమే కాకుండా, మొత్తం శరీరాన్ని కూడా చల్లగా ఉంచుకోవాలి.

అదే సమయంలో ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.

ఇందుకోసం గ్రీన్ జ్యూస్‌ బెటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలోవెరా జ్యూస్ చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో దీన్ని తాగడం వల్ల రోజంతా తాజాగా ఉంటుంది.

వేసవిలో చెరకు రసం డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

రోజూ ఆహారంలో ఒక గ్లాస్ పొట్లకాయ రసం తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.

కాకరకాయ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

పాలకూర జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.