ఉసిరికాయలో విటమిన్‌ సి అలాగే విటమిన్‌ ఏ, బి,పోటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉసిరి కళ్లకు మేలు చేస్తుంది. ఇందులోని కెరోటిన్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది. జామకాయ రసంతో కంటిశుక్లం, కంటి చికాకు, రెటీనా సమస్యలు దరిచేరవు.

ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడం ద్వారా కొవ్వును కరిగేందుకు దోహదపడతాయి.

ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల రోజంతా పూర్తి పోషకాహారం, శక్తి లభిస్తుంది. ఉసిరి రసం ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరం రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంటుంది. 

శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. ఇది యూరినరీ ఇన్ఫెక్షన్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

ఉసిరిలోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్లతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. 

2 గ్లాసుల నీళ్లు తీసుకుని దానికి తరిగిన జామకాయలను వేయాలి. ఈ నీటిని మరిగించి,నీరు సగానికి తగ్గినప్పుడు వడకట్టి చల్లబడిన తర్వాత తాగాలి.

అందువల్ల ఉసిరి,జామకాయ జ్యూస్‌ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మరిన్ని ఆరోగ్య సంబంధిత సమాచారం కోసం చదువుతూ ఉండండి..