స్ట్రాబెర్రీ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం

స్ట్రాబేర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్‌ కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది

ఇందులో ఉండే విటమిన్‌ సి.. ఫ్రీరాడికల్స్‌ నుంచి కళ్లను కాపాడుతుంది

ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాన్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది

స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి క్యాన్సర్‌, నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలను కూడా నివారించవచ్చు

స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది

వీటిని నిత్యం తీసుకుంటే ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది