స్త్రీల మాదిరిగానే పురుషులు కూడా చిన్న వయస్సులోనే అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు
కనుక సరైన ఆహారం, దినచర్యను అనుసరించడం ఉత్తమం
అదే సమయంలో చురుకుగా ఉండడానికి యోగాసనాలను వేయడం మంచిఫలితాలు ఇస్తుంది
ముఖ్యంగా సీతాకోకచిలుక భంగిమ చేయడం ద్వారా పురుషులు తమను తాము చురుకుగా, ఫిట్‌గా ఉంచుకోవచ్చు
ఉదయాన్నే సీతాకోకచిలుక భంగిమ చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషులు ప్రతిరోజూ సీతాకోకచిలుక భంగిమ చేస్తే, చాలా కాలం పాటు కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది
సీతాకోకచిలుక భంగిమ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది
మోకాళ్ల నొప్పులతో పాటు..ఇతర కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి పురుషులకు సీతాకోకచిలుక భంగిమ సహాయం చేస్తుంది