తులసీ విత్తనాలు జలుబు, దగ్గు నుండి విముక్తి పొందడంలో సహాయపడుతుంది

తులసి గింజలను డికాక్షన్‌లో కలుపుకుని కూడా తీసుకొవచ్చు. ఈ డికాషన్ జలుబు, దగ్గు నుండి త్వరగా బయటపడటానికి సహాయపడుతుంది

ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని బయటకు తీసేయటంలో ఇది పనిచేస్తుంది

ఈ గింజలను తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది

శరీరానికి కావలసిన పోషకాలను  అందించి బరువును తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి

ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, విరేచనాలను నివారించడానికి పనిచేస్తుంది

తులసి గింజలను నమిలి తింటే దంతాలలో పేరుకుపోయిన బ్యాక్టీరియా నశించి దంత సమస్యలు దూరమవుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది

కాచి చల్లార్చిన నీటిలో తులసి రసాన్ని కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగడంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది