అరటి పండు తొక్క మలబద్దకాన్ని నివారిస్తుంది

మూడ్‌ను మార్చి డిప్రెషన్‌ను తగ్గించే సెరొటోనిన్ అనబడే సమ్మేళనం కూడా అరటి పండు తొక్కలో ఉంటుంది

అరటిపండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయట

నీటిలో ఉండే లోహాలను, ఇతర విషపదార్థాలను తొలగించడంలోనూ అరటి పండు తొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది

నీటిలో అరటి పండు తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు

కాలిన గాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దన చేస్తే ఆయా గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి

అరటిపండు తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి

అరటి పండు తొక్కలను ముఖానికి మర్దన చేసినట్లు రాస్తే మొటిమల సమస్య తగ్గుతుంది