ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు మానవ మేథస్సుకు సైతం అందని రహస్యాలు
కొన్నింటిని తెలుసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సక్సెస్ అందుకోలేక ఆశ్చర్యపరుస్తున్నాయి
ఇప్పుడు మనం ప్రకృతిలోని ఓ వింత జలపాతం వెనుక నిత్యం వెలిగే దీపం గురించి తెలుసుకుందాం
అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్‌లో చెస్ట్ నట్ రిడ్జ్ అనే పార్క్ ఉంది
అక్కడ షేల్ క్రీక్ ప్రిజెర్వ్ అనే ఓ ప్రదేశంలో ఈ జలపాతం జాలువారుతూ ఉంది
దీని వెనక ఓ దీపం ఉంది అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది తప్ప ఆరడంలేదు అలాగని పెద్ద మంట కూడా రావట్లేదు
ఈ జలపాతం వెనక ఒక బండరాయి ఉంది. ఆ రాయి కింద భూభాగానికి ఓ చిన్న కన్నం ఉంది
ఆ కన్నం నుంచి కంటిన్యూగా గ్యాస్ బయటకు వస్తోంది. ఎలా అంటే మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు వచ్చే మంటలాగా వస్తుంది
ఆ కన్నం నుంచి కంటిన్యూగా గ్యాస్ బయటకు వస్తోంది. ఎలా అంటే మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు వచ్చే మంటలాగా వస్తుంది
ఆ సహజ వాయువు వల్లే ఆ దీపం వెలుగుతోందని పరిశోధకులు తేల్చారు
దీన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వం పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది