ఫేషియల్ చేయించుకున్నాక చర్మం సున్నితంగా మారుతుంది
ఆ సమయంలో ఎండలోకి వెళ్లడం, కాలుష్య ప్రభావానికి గురికావడం మంచిది కాదు
పగటి పూట ఫేషియల్ చేయించుకున్నాక బయటకు వెళ్లాల్సి వస్తే మెత్తని స్కార్ఫ్‌ని ముఖానికి చుట్టుకోవాలి
పొడి చర్మతత్వం వారు ఫేషియల్ చేయించుకోవడం వల్ల ముఖం మరింత పొడిబారే అవకాశం ఉంది
అందుకే బ్లీచ్ వంటివాటి జోలికి వెళ్లకుండా హైడ్రేటెడ్ రకాల్ని ఎంచుకుంటే మేలు
ఫేషియల్ చేయించుకున్న 3, 4 రోజుల వరకూ కొత్త రకాల సౌందర్యోత్పత్తులు వాడకపోవడం మంచిది
ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వంటివి చేయకూడదు. సబ్బు, ఇతర క్రీములు కూడా ఒక రోజంతా రాసుకోవద్దు
చేతులతో చర్మాన్ని తాకడం, ముఖం కడుక్కున్నప్పుడు తువాలుతో బలంగా రుద్దుకోవడం వంటివీ చేయకూడదు