ఎండ వేడిమికి సున్నితమైన అదరాలు పదిలంగా ఉండాలంటే..

వేసవిలో కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి

వేసవిలోనూ పెదాలు డీహైడ్రేట్‌ అవకుండా తేమగా ఉంచడానికి లిప్‌బామ్‌లు వాడాలి

ఎస్‌పీఎఫ్‌ 15 ఉన్నవి ఎంచుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు

ఉదయాన్నే పళ్లు తోముకున్న తర్వాత అదే బ్రష్‌తో పెదాలపై సున్నితంగా రుద్దితే నిర్జీవంగా ఉన్న చర్మం తొలగిపోతుంది

పెరుగు/పాల మీగడ కొద్దిగా వేలితో తీసుకొని నిదానంగా పెదవులపై స్క్రబ్‌ చేస్తే పగుళ్లు తగ్గుముఖం పడతాయి

కొంచెం తేనె, పంచదార కలుపుకొని పెదాలపై మృదువుగా స్క్రబ్‌ చేస్తే గులాబి రంగులో మెరిసిపోతాయి