నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శత్వం వహించిన సినిమా ‘వీరసింహారెడ్డి’

బాలయ్యకు జోడీగా శృతిహాసన్‌ నటించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై  నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు

సంకాంత్రి కానుకగా జనవరి 12న విడుదయాలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది

అయితే థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది

ఈ నేపథ్యంలో వీర సింహారెడ్డి ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది

దీని ప్రకారం ఈ చిత్రం  త్వరలో ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది

ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్‌ను డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది

వీర సింహారెడ్డి ఓటీటీ హక్కుల కోసం డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ మేకర్స్‌తో భారీ ధరకు డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం

ఇదిలా ఉండగా  ఫిబ్రవరి 21 నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు హాట్‌స్టార్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది