కొత్త సినిమాల విషయంలో జోరు మీద ఉన్నా బాలయ్య ఒక మూవీ పూర్తి కాకముందే, ఇంకో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసువెళ్తున్నారు

సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’తో సందడి చేయనున్న విషయం తెలిసిందే

ఇప్పటికే అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఒక షెడ్యూల్‌ కూడా పూర్తిచేసుకొన్నారు

తరువాత అయన చేయబోయే సినిమాల జాబితా కూడా కాస్త పెద్దగానే కనిపిస్తోంది

ఇటీవలే ‘వీరసింహారెడ్డి’ ఈవెంట్ లో చెంఘీజ్‌ఖాన్‌ కథతో మూవీ చేయాలనుందని చెప్పారు

ఈ దశలోనే ‘బింబిసార’తో విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు వశిష్ట తన తర్వాతి సినిమాని బాలకృష్ణతో తెరకెక్కించనున్నరాని తెలుస్తోంది

ఇప్పటికే కథ విన్న బాలయ్య వశిష్టకు అంగీకారం తెలిపారని చిత్ర వర్గాల సమాచారం

‘బింబిసార’ను సోషియో ఫాంటసీ చిత్రంగా రూపందించిన వశిష్ట బాలకృష్ణతోనూ ఓ కొత్త రకమైన ప్రయత్నం చేయనున్నారని తెలిసింది