నందమూరి కుటుంబం తారకరత్న మరణంతో శోక సంద్రంలో మునిగిపోయింది
చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అభిమానులలో విషాద ఛాయలు అలముకున్నాయి
గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు
తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, పిల్లలు ఆయన మరణంతో ఒంటరి వారైపోయారు
దీంతో తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత బాలకృష్ణ తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం
ఇక నుంచి తారకరత్న ముగ్గురు పిల్లల బాగోగులు, చదువులు తానే చూసుకుంటానని, బాబాయ్‌గా తారక్ కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట
అయితే తారకరత్న హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి బాలయ్య అన్ని పక్కన పెట్టి అయన ఆరోగ్య విషయాలను పర్యవేక్షించిన విషయం తెలిసిందే
బాబాయ్‌గా ఎప్పుడు తారకరత్న వెన్నంటే ఉన్న బాలయ్య అయన మరణాంతరం కూడా తన కుటుంబానికి అండగా నిలిచారు