నందమూరి తారకరత్న మరణించి నెల రోజులు పూర్తయింది
ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేనిది
తమ కుటుంబానికి బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
ప్రస్తుతం బాలయ్య తారకరత్న అభిమానులకు గుర్తుండిపోయేలా ఓ నిర్ణయం తీసుకున్నారు
తన కుటుంబానికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని బాలయ్య తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు
అంతేకాకుండా హిందూపురంలో నిర్మించిన హాస్పిటల్ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు బాలయ్య
వాటితో పాటు పేదప్రజల వైద్యం కోసం రూ.1.30 కోట్లు విలువైన ఆపరేషన్ పరికరాలను కూడా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు
ఆస్పత్రిలో చేరే చిన్నపిల్లలకు ఉచితంగా భోజనంతోపాటు, మందులు కూడా మూడు నెలల పాటు ఇవ్వనున్నారు
తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయేలా బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు