బి. గోపాల్ దర్శకత్వం లో బాలయ్య బాబు హీరో గా తెరకెక్కిన చిత్రం ‘సమర సింహా రెడ్డి’
అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ వన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
బాలయ్య ఊర మాస్ యాక్షన్ తో పాటుగా, సీమ పౌరుషం అక్కడి పగ ప్రతీకారాలు ఎలా ఉంటాయో, అవన్నీ ఈ చిత్రం లో చూపించారు.
ఇక ఈ చిత్రం లోని ట్రైన్ సన్నివేశం అప్పట్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది.
ఆరోజుల్లోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా 16 నుండి 17 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించిందట.
అయితే ఈ సినిమాని తొలుత నందమూరి బాలకృష్ణ తో చేద్దాం అని అనుకోలేదట,
విక్టరీ వెంకటేష్ తో ఈ చిత్రాన్ని చేద్దాం అనుకున్నారట డైరెక్టర్ బి గోపాల్.
వెంకటేష్ కి కథ బాగా నచ్చింది కానీ, తనకి ఇలాంటి సినిమాలు సూట్ అవ్వవు, నాతో కాకుండా చిరంజీవి లేదా బాలయ్య తో తీసుకోండి అని అన్నాడట.