నటసింహం నందమూరి బాలకృష్ణ  అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ  ఆహా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బాలయ్య.

ఇక అన్ స్టాపబుల్ మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఇప్పుడు సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు.

అన్ స్టాపబుల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను విజయవాడలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. 

అలాగే అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి అప్డేట్ కూడా త్వరలోనే రానుంది.

ఈ సారి మరింత ఊపుతో , మరింత ఎనర్జీతో సింహం గర్జించబోతుంది అంటున్నారు బాల ఫ్యాన్స్