కుటుంబ సంబంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాల నేపథ్యంలో తెలంగాణ చిత్రంగా ప్రేక్షకులముందుకొచ్చిన సినిమా బలగం.
స్టార్ కమెడీయన్ వేణు యెల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించాడు.
తెలంగాణ పల్లెల్లోని, కుటుంబాల్లోని ఎమోషన్స్ ని తెరపైకి తీసుకొచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు.
రెండు రోజుల కింద రెండు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.
లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాలలో అవార్డులను దక్కించుకుంది
తాజాగా ఉక్రెయిన్ లోని ఒనికో ఫిల్మ్ అవార్డు నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విబాగంలో అవార్డును సొంతం చేసుకుంది.
బలగం చిత్రానికి మొత్తం నాలుగు అవార్డులు దక్కాయని దర్శకుడు వేణు సంతోషం వ్యక్తం చేశారు.