‘వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా’ అంటూ ‘గంగోత్రి’ సినిమాలో ఆడి పాడిన చిన్నారిని అంత ఈజీగా మర్చిపోలేరు.

ఈమె పేరు కావ్య కళ్యాణ్ రామ్. ఆ చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కావ్య కనిపించింది.

అయితే ఆ చిత్రం వచ్చి 20 ఏళ్ళు పూర్తయ్యింది. కావ్య ఇప్పుడు హీరోయిన్ కూడా అయిపోయింది.

ఆమె హీరోయిన్ గా నటించిన ‘మసూద’ ‘బలగం’ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి.

త్వరలో ‘ఉస్తాద్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సో ఈ మూవీతో కావ్య హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడుతుందని కొందరు భావిస్తున్నారు. బట్ ఫైనల్ గా ఏమవుతుంది అనేది చూడాలి.

ఇదిలా ఉండగా.. తాజాగా కావ్య చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్.. ట్రోలింగ్ కు దారి తీశాయి.

ఆమె మాట్లాడుతూ.. ‘నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సన్నివేశాల్లోనూ నటించాలి.

ఇండస్ట్రీలో లిప్‌లాక్‌ సీన్స్‌, బెడ్‌ సీన్ల కోసం హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు.

అలాగే కథ కూడా డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నాకు అభ్యంతరం ఈమె లేదు.’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

కావ్యకి కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలని ఉన్నట్టు.. ఈ కామెంట్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.