ఆధ్యాత్మికంగానే కాదు ఔషధంగా కూడా మేలు చేసే గరిక
గరికలో నల్ల గరిక, తెల్ల గరిక అని రెండు రకాలు
పొడవుగా పెరిగేది. తీగలా పాకేది అని రెండు రకాలు
నల్ల గరిక కంటే తెల్ల గరికతో ఆరోగ్యానికి ఎంతో మేలు
గరిక గడ్డిని, ఉత్తరేణి ఆకులను, చిన్న యాలకులను సమానంగా కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని గాయాలపై రాసిన వెంటనే గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే గుణం కూడా గరికకు ఉంది
గరిక తైలం అన్ని రకాల చెవి సమస్యలను నివారిస్తుంది
చర్మ రోగాలను తగ్గించే గుణం కూడా గరికకు ఉంది.