చలికాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు

చల్లని వాతావరణంలో పంటి నొప్పి భరించడం కష్టం

దంత సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ శీతాకాలంలో ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు

చక్కెర పదార్ధాల నుంచి ఉత్పత్తి అయ్యే యాసిడ్ దంతాలు, చిగుళ్ళకు హానికరం. కాబట్టి చలికాలంలో స్వీట్లకు, తీపి ఆహారాలకు దూరంగా ఉండండి

శీతల పానీయాలు దంతాలకు అస్సలు మంచివి కావు

చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలను ఉపయోగించి తయారు చేసే అనేక చాక్లెట్లు ఉన్నాయి. ఇది పంటి నొప్పికి కారణం కావచ్చు

ఎండుద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ రుచిలో తియ్యగా ఉంటాయి. వాటిలోని స్వభావం దంతాలను దెబ్బతీస్తుంది

దంత సమస్యలు ఉన్నప్పుడు చిప్స్ అస్సలు తినకూడదని నిపుణులు పేర్కొంటున్నారు