IPL 2023 వేలంలో ఎంట్రీ ఇచ్చిన ఆల్ రౌండర్.. డబ్బుల వర్షం కురిపించేందుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
వచ్చే నెలలో వేలం నిర్వహించనుండగా, ఇందుకోసం ఆటగాళ్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ ఈ వేలం కోసం నమోదు చేసుకున్నాడు.
ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఐపీఎల్ తదుపరి సీజన్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఈ మేరకు మాట్లాడుతూ, "నేను ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకున్నాను. ఇది ఒక గొప్ప అవకాశం. అక్కడ అత్యుత్తమ కోచ్‌లు ఉన్నారని తెలిపాడు.
గ్రీన్ ఇటీవల భారత పర్యటనలో తన తుఫాను బ్యాటింగ్‌తో సందడి చేశాడు. ఆరోన్ ఫించ్ స్థానంలో డేవిడ్ వార్నర్‌తో ఓపెనింగ్ చేశాడు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతను రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే బౌలింగ్ చేస్తూ వికెట్లు కూడా పడగొట్టాడు.
ఒకవేళ గ్రీన్ వేలంలోకి వస్తే, ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీ పడతాయి.
టీ20 క్రికెట్లో ఆల్-రౌండర్లకు అన్నిజట్లు ఫిదా అవుతుంటాయి.
అన్ని జట్టు బ్యాట్, బాల్ రెండింటిలోనూ సహకరించగల ఆటగాళ్లను కలిగి ఉండాలని కోరుకుంటుంది.