ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త. జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో జాగ్రత్త. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
అనుకోకుండా మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.
ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. రాజకీయంగా కార్యకలాపాలు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగి సమయానికి నిద్రాహారాలు కూడా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. తోబుట్టువులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.
ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు, వృథా ఖర్చుల వల్ల ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. గృహ నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి.
రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, మద్యం తదితర రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. రాజకీయాల్లో చేరేందుకు అవకాశాలు అంది వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల నుంచి కూడా ధన సహాయం అందుతుంది.
వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. సహోద్యోగుల వ్యవహారాలలో కల్పించుకోకపోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు.