ఆసియా కప్‌లో కనక వర్షం.. ఛాంపియన్ శ్రీలంకకు ఎంత దక్కిందంటే?
ఆసియా కప్ 2022 ఛాంపియన్ గా శ్రీలంక అవతరించింది.
పాకిస్థాన్‌ను 23 పరుగుల తేడాతో ఓడించి 6వసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
8 ఏళ్ల తర్వాత శ్రీలంక టీం ఆసియా కప్ ట్రోఫిని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 170/6 స్కోరు చేసింది.
అనంతరం పాక్ బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది.
ఈ విజయం తర్వాత శ్రీలంక ఆటగాళ్లపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ కాసుల వర్షం కురిపించింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్ శ్రీలంక జట్టుకు ట్రోఫీతోపాటు సుమారు 1 కోటి 59 లక్షలు అందుకున్నారు.
రన్నరప్ పాకిస్థాన్‌కు దాదాపు రూ.59.74 లక్షల ప్రైజ్ మనీ లభించింది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వనిందు హసరంగకు రూ.11.94 లక్షలు అందాయి.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ భానుక రాజపక్సేకు రూ.3.98 లక్షలు లభించాయి.