తొలి మ్యాచ్ ఆగస్ట్ 31న, ఫైనల్ సెప్టెంబర్ 17న.. ఆసియాకప్ షెడ్యూల్ ఇదే..

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ తేదీలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది.

ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు జరుగుతుంది.

ఈసారి టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. పాకిస్థాన్‌లో 4, 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.

ఈ టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

సూపర్-4, ఫైనల్ మ్యాచ్‌లతో కలిపి మొత్తం 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత్-పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో ఈ మ్యాచ్ శ్రీలంకలోనే జరగనుంది.

అలాగే, ఈ గ్రూప్‌లో నేపాల్ మూడో జట్టుగా కనిపించింది. ఈసారి ఆసియా కప్‌లో ఆడనున్న 6 జట్లు పోటీపడనున్నాయి.