‘రాజుగారి గది’ ఫేం అశ్విన్ బాబు కొత్త మూవీ రామానాయుడు స్టూడియోలో శుక్రవారం ప్రారంభమైంది
శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నరు
పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు
‘వచ్చిన వాడు గౌతం’ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు
కొత్త డైరెక్టర్ ఎం ఆర్ కృష్ణ దర్శకుడిగా డీఎస్సార్ నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు
శుక్రవారం జరిగిన పూజ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్, హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు
సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేసి సినిమా ప్రారంభించారు
ఓపెనింగ్ షాట్‌కు నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు