ఫైనల్ చేరిన అర్జెంటీనా.. కష్టాల్లో ఆదుకునే వాడే మెస్సీ అంటూ కేటీఆర్ ట్వీట్‌

మెగా సూపర్‌ పవర్‌‌ జట్టు అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కి చేరింది.

సెమీఫైనల్లో బలమైన క్రొయేషియాని మట్టి కరిపించింది మెస్సీ టీమ్‌.

3-0 గోల్స్‌ తేడాతో నెగ్గి.. ఆఖరి సమరానికి అర్హత సాధించింది.

మైటీ ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ 34వ నిమిషంలో తొలి గోల్‌ వేయగా.. తర్వాత పని అల్వారేజ్‌ కానిచ్చేశాడు.

39వ నిమిషంలో రెండో గోల్‌.. 69వ నిమిషంలో మూడో గోల్‌ చేశాడు.

గ్రౌండ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు పాదరసంగా కదిలారు.

చివరి గోల్‌ కోసం మెస్సీ ఇచ్చిన అసిస్ట్‌ అద్భుతం.

నిజానికి టోర్నీ తొలి మ్యాచ్‌ ఓడి.. అర్జెంటీనా టీమ్‌ కష్టాల్లోపడింది.

సౌదీ చేతిలో ఓటమి జట్టులో కసిని పెంచింది తర్వాత ఒక్కో మ్యాచ్‌గెలుస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వచ్చింది మెస్సీ జట్టు.

నాకౌట్‌ దశలో ఆ టీమ్‌ దిమ్మతిరిగే పెర్ఫామెన్స్‌ ఇస్తూ... ప్రత్యర్థులకు షాకులమీద షాకులు ఇచ్చింది.

రాత్రి జరిగిన పోరులోనూ చాంపియన్‌లా ఆడి గెలిచి.. ఫైనల్‌ పోరులో నిలిచింది.

టోర్నీని మొదటి నుంచీ ఫాలో అవుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌.

రాత్రి మ్యాచ్‌లో మెస్సీ గోల్‌కు ముద్ధులైన మంత్రి.. ట్వీట్‌ కూడా చేశారు.

కష్టాల్లో ఆదుకునే వాడే మెస్సీ అంటూ ఓ లాటిన్‌ కొటేషన్‌ని ట్వీట్‌ చేశారు.