వేసవిలో చెమట కారణంగా శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది
దీని నుంచి తప్పించుకోవడానికి సెంటు, ఫర్‌ఫ్యూమ్, డియోడరెంట్‌లను ఎక్కువగా వాడుతుంటాం
ఇవి ఒంటి దుర్వాసనను అడ్డుకొన్ని కొన్ని గంటలపాటు శరీరం నుంచి సువాసనల్ని వెదజల్లుతుంటాయి
ఐతే వీటిని సుదీర్ఘకాలం ఉపయోగించినా, సరైన దిశలో వినియోగించకపోయినా ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు
వీటి తయారీలో రకరకాల రసాయనాలను వాడటం వల్ల అలర్జీ, క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు
రసాయనాలకు బదులుగా సహజంగా పూలూ, పండ్లతో తయారు చేసిన సెంట్లను వినియోగించాలి
డియోడరెంట్‌ల్లోని రసాయనాల వల్ల చర్మం త్వరగా తేమను కోల్పోతుంది. అందువల్ల ఒంటిపై చల్లుకునేవి కాకుండా దుస్తులపై స్ప్రే చేసేవి బెటర్