వ్యక్తుల ఆర్థిక అత్యవసరాల కోసం బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఇస్తాయి

ఆర్థిక ఒత్తిడి, అత్యవసరమైనప్పుడు  సులభంగా పర్సనల్ లోన్ లభిస్తుంది

నెలవారీ ఈవీఎంల ద్వారా తీసుకున్న రుణాన్ని వడ్డీతో కలిపి చెల్లించే వెసులుబాటు ఉంటుంది

పర్సనల్ లోన్ మంజూరు చేసే సమయంతో పాటు రుణాలను తిరిగి చెల్లించే సమయంలో బ్యాంకులు 6 రకాల ఫీజులు వసూలు చేస్తాయి

ఆ రకరకాల ఫీజులేంటి..? ఏయే బ్యాంకు ఎంత మొత్తం వసూలు చేస్తాయి? తదితర అంశాలను ముందుగానే తెలుసుకోవాలి

లోన్ మొత్తంపై 0.5 శాతం నుంచి 2.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తారో బ్యాంకర్‌ను అడిగి క్లారిటీ తెచ్చుకోవాలి

పర్సనల్ లోన్ ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు వెరిఫికేషన్ ఛార్జీలు వసూలు చేస్తాయి

ప్రతి నెలా గడువు నాటికల్లా ఈఎంఐని చెల్లించలేని పక్షంలో బ్యాంకులు లేట్ ఫీజులు వసూలు చేస్తాయి

అలాగే జీఎస్టీ, ప్రీ పేమెంట్ ఛార్జీ, డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఫీజు వీటి గురించి ముందే తెలుసుకోవాలి