ప్రతి ఒక్కరూ వారి స్వంత స్టైల్‌లో నిద్రోపోతుంటారు. కొంతమంది వెల్లకిలా, నిటారుగా నిద్రపోతారు, కొందరు ఒకవైపునకుతిరిగి పడుకుంటారు.

మీరు నిద్రించే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? బోర్లా పడుకోవద్దని ఇంట్లోని పెద్దలు చాలాసార్లు చెబుతుంటారు.

ఇలా చెప్పడానికి కారణం ఆరోగ్య ప్రయోజనాలే. అవును, బోర్లా పడుకోవడంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రపోయేటప్పుడు గురక పెట్టే అలవాటు ఎవరికైనా ఉంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.

అలాంటి పరిస్థితిలో బోర్లా నిద్రపోవడం వలన గురక సమస్య నుంచి బయటపడుతారు. శ్వాస తీసుకోవడం సులభమై.. గురక రాదు.

బోర్లా పడుకోవడం వలన శరీరం క్రియారహితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, జలదరింపు సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి శరీరం మొద్దుబారిపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది.

బోర్లా పడుకునే వారికి ముఖ్యంగా తరచుగా మెడ నొప్పి వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం... బోర్లా పడుకుని నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం.

దీని వల్ల శరీరం బరువు, ఒత్తిడి వెన్నెముకపై పడుతుంది. వెన్నుపాముపై ఒత్తిడి పెరిగి.. శరీరంలోని ఇతర భాగాలలో నొప్పులు వస్తాయి.