డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. లేకపోతే.. రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది.
చాలామంది మధుమేహ రోగులు ఎండుద్రాక్ష (కిస్‌మిస్) లను తినేందుకు భయపడుతుంటారు.
కిస్‌మిస్ మంచిరుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది.
ఎండుద్రాక్ష ఒక పండు ఇది ఇతర రకాల పండ్ల మాదిరిగా సహజ చక్కెరను కలిగి ఉంటాయి.
మధుమేహం ఉన్నవారు ఎలాంటి సంకోచం లేకుండా ఎండుద్రాక్ష తినవచ్చు.
అయితే, తగినంత పరిమాణంలోనే తినాలి. ఎక్కువగా తింటే చక్కెర స్థాయి పెరుగుతుంది
2 టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్షలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగుల శరీరానికి సరిపోతుంది.