పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారికి నడుం సన్నబడాలంటే అర్ధ మత్స్యాసనం ట్రై చేయాలి

ముందు కాళ్లను తిన్నగా ముందుకు చాపి, ఎడమ కాలిని మడిచి, మడాన్ని కుడి పిరుదు వద్దకు తీసుకెళ్లాలి. ఎడమ మోకాలిని కుడి పాదానికి తాకించాలి

అప్పుడు కుడి కాలి పాదం ఎడమ మోకాలి వద్ద నేలమీద ఉంటుంది. వెన్నెముక నిటారుగా కాకుండా రిలాక్స్‌డ్‌గా ఉంచాలి

ఎడమ చేతిని కుడి మోకాలి పక్కనుంచి తీసుకెళ్లి కుడి పాదపు చీలమండను పట్టుకోవాలి

వీపు పై భాగాన్ని కుడివైపుకు మీకు వీలైనంత వరకు తిప్పాలి

కుడిచేతిని వెనుకవైపు పెడుతున్నప్పుడు కుడి భుజం మీది నుంచి చూడాలి

మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఈ భంగిమలో కొన్ని నిమిషాలు ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి. రెండో కాలితో కూడా ఇలాగే చెయ్యాలి. ఇలా చేయడం వల్ల పొట్ట, నడుము దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది