ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఫేషియల్స్, బ్లీచ్‌లు వంటి రకరకాల బ్యూటీ ట్రీట్‌మెంట్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

 కానీ మనం రోజూ వాడే సహజసిద్ధమైన ఉత్పత్తుల ప్రయోజనాలు చాలా మేలు చేస్తాయి. 

మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మం, చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.

 మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు నీటిని వడకట్టి, కాటన్ గుడ్డను నానబెట్టి మీ ముఖానికి అప్లై చేయండి.

నానబెట్టి నీటిని మీరు స్ప్రే బాటిల్‌లో నింపి రోజూ మీ ముఖంపై స్ప్రే చేసుకోవచ్చు.

నానబెట్టిన మెంతులను పేస్టులా చేసి అందులో పెరుగు కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.

మెంతులలోని పొటాషియం 20లలో వచ్చే నెరిసిన జుట్టు పెరుగుదలను నివారిస్తుంది.

నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేసి దానికి జామకాయ ఆకు రసాన్ని కలిపి జుట్టు మూలాలకు పట్టించి తలస్నానం చేయాలి.

 మెంతుల పేస్టును పాలలో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.