యాపిల్ వెనిగర్ అనేక సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. అందుకే చాలామంది దీనిని తీసుకుంటారు
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న ఆపిల్ సైడర్ వెనిగర్.. పలు సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది.
అయితే, కొన్ని విషయాల్లో మాత్రం చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది... దీనివల్ల దంతాలు దెబ్బతింటాయి.
యాపిల్ వెనిగర్‌లో యాసిడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో పొటాషియం స్థాయిని తగ్గిస్తుంది.
నేరుగా యాపిల్ వెనిగర్ తీసుకుంటే ఎముకలలో ఖనిజ సాంద్రత తగ్గి క్రమంగా బలహీనపడతాయి
ఆపిల్ వెనిగర్ శరీరంలోని బ్లడ్ షుగర్ పరిమాణాన్ని తగ్గించి హైపోగ్లైసీమియాకు కూడా కారణమవుతుంది.