టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా 'సిటాడెల్‌' హిందీ రీమేక్‌లో నటిస్తున్న సంగతి  తెలిసిందే

ది ఫ్యామిలీ మేన్‌ డైరెక్టర్స్ రాజ్‌, డీకే ఈ సిరీస్‌ను చిత్రీకరిస్తున్నారు

తాజాగా సిటాడెల్‌ షూటింగ్‌లో సమంత పాల్గున్నారని అధికారికంగా ప్రటించారు

అయితే విజయ్‌ దేవరకొండ ఖుషి చిత్రానికి సమంత డేట్స్‌ ఇవ్వడం లేదంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతుంది

ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్ ఖుషి పరిస్థితేంటి? అని ప్రశ్నించాడు

దీంతో 'విజయ్‌ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు. ఖుషి షూటింగ్‌ను అతి త్వరలో తిరిగి ప్రారంభించనున్నాం' అని సమంత  తెలిపింది

మొత్తానికి మంచివార్త చెప్పావంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫాన్స్