టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి అనుష్క శెట్టి
అయితే ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నటువంటి అనుష్క తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ తాను ఆరో తరగతి చదివే సమయంలోనే తనకు లవ్ ప్రపోజల్ వచ్చిందని తెలిపారు.
తన క్లాస్మేట్ ఒక అబ్బాయి తన వద్దకు వచ్చి ఐ లవ్ యు చెప్పాడట.
అసలు ఐ లవ్ యు అంటే ఏమో కూడా తెలియకుండా తాను ఓకే అని చెప్పానని అనుష్క ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే అదొక మెమొరీగా నాకు గుర్తుండి పోయిందని ఈమె తెలిపారు.
ఈ విధంగా అనుష్క తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.