టీమిండియా లో విరాట్ కోహ్లీ కి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచకప్ లో సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.
నవంబర్ 5న కోహ్లీ తన 34వ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.
పుట్టినరోజు సందర్భంగా అతడి భార్య చేస్తూ విషెస్ సోషల్‌మీడియా విరాట్‌కు సంబంధించిన ఫన్నీ ఫొటోస్ను పోస్ట్ చేసింది అనుష్క శర్మ.
15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. అనతి కాలంలోనే అగ్ర స్థానానికి చేరుకున్నాడు.
భారత్ జట్టుకు ఎన్నో కీలక విజయాలను అందించి బెస్ట్ కెప్టెన్‌గా పేరు సంపాదించుకున్నాడు.
కోహ్లీ తన ఆటతో ఎంత పాపులర్ అయ్యాడో.. అంతకుమంచి అతడి టాటూలతో పాపులర్ అయ్యాడనేది వాస్తవం.
కోహ్లీ వంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 టాటూలు ఉన్నాయి. ప్రతి టాటూ వెనుక ఒక కథ ఉండటం విశేషం.