'అఆ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌.

సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు.

తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

గత ఏడాది కార్తికేయ 2చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఎప్పుడు సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.

తాజాగా 'నువ్వు పెద్ద హీరోయిన్‌వి ఏమీ కాదు. అందుకే భారీ సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు.

అసలు మీరు హీరోయిన్‌ మెటీరియలే కాదు' అంటూ ఓ నెటిజెన్ కామెంట్‌​ చేశాడు.

దీనికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది అనుపమ.

'మీరు చెప్తుంది కరెక్టే అన్నా, నేను హీరోయిన్ టైప్ కాదు, నేను యాక్టర్ టైప్‌' అంటూ చాచి చెంపపై కొట్టినట్లు బదులిస్తూనే స్మైలీ ఎమోజీలను జత చేసింది.