వెంకటేష్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’

వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు

ఇటీవలే  లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం కోసం మరో స్టార్‌ హీరోను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది చిత్ర బృందం

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉన్న హీరో ఆర్య ఈ చిత్రంలో  కీలక పాత్రలో పోషిస్తున్నట్లు సమాచారం

చాలా శక్తివంతమైన పాత్రలో హీరో ఆర్య ఈ సినిమాలో కనిపించనున్నారు

మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ తొలి వారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది

వెంకటేష్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’

వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది