హీరో రవితేజ కుటుంబం నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కానున్నారు
రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్‌ను హీరోగా పరిచయం చేయనున్నారు దర్శకురాలు గౌరీ రోణంకి
ఈ చిత్రానికి జేజేఆర్ రవిచంద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు
గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది
ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి ప్రారంభించారు
ఈ చిత్ర దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందించగా డి.సురేష్‌బాబు కెమెరా ఆన్ చేశారు
బెక్కెం వేణుగోపాల్, చదలవాడ శ్రీనివాసరావు, రఘు తదితరులు ఈ కార్యక్రమనికి హాజరయ్యారు
ఈ నేపథ్యంలో దర్శకురాలు గౌరీ మాట్లాడుతూ.. ‘‘ఇది నా రెండో చిత్రం. చాలా యూత్ ఫుల్‌గా ఉంటుంది’’ అని తెలిపారు