‘కార్తికేయ2’, ‘18 పేజెస్’ మూవీస్ తో వరుస హిట్స్ తో ఫుల్ జోష్‌లో ఉంది అనుపమ
ప్రస్తుతం ఆమె తెలుగులో ‘టిల్లు స్క్వేర్’లో హీరోయిన్ గా నటిస్తున్న తెలిసిందే
కాగా ఇప్పుడామె కోలీవుడ్ నుంచి మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు తెలిసింది
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌లో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిచనున్నట్లు సమాచారం
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కుస్తున్నట్లు తెలుస్తోంది
ఈనెల 13న చెన్నైలో ఈ చిత్రాన్ని లాంఛనంగాప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
అయితే ఈ చిత్ర డైరెక్టర్ ఎవరో ఆరోజే స్పష్టత ఇవ్వనుంది చిత్రబృందం
ప్రస్తుతం తమిళంలో జయం రవితో ‘సైరన్’ మూవీలో నటిస్తుంది అనుపమ