నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’

స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్‌ పతాకాలపై ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు

ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌, షావుకారు జానకి తదితరులు కీలక పాత్రల్లో నటించారు

ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ నేపథ్యంలో  శనివారం హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు

హీరోహీరోయిన్ల కుటుంబాల మధ్య ఉన్న అందమైన బంధాన్ని టీజర్‌లో ఎమోషనల్ గా చూపించారు

ఈ టీజర్ బట్టి ఈ చిత్రం హిల్‌ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సాగే కుటుంబ కథా చిత్రమని అర్థమవుతోంది