అంజీర్ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలున్నాయి.
జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఈ హెల్తీ ఫ్రూట్ లో శరీర బరువును తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
మలబద్ధకం, కడుపు సమస్యలున్న వారు ఉదయాన్నే అంజీర్ పండ్లను తింటే.. జీర్ణవ్యవస్థను బాగా పని చేస్తుంది.
అత్తిపండ్లు అధిక రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అంజీర్ పండ్లు ఎముకలు దృఢంగా మార్చి.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.