ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను రాణిస్తోంది అంజలి. అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లోను నటిస్తూ మెప్పిస్తోంది.
ఇక ఈ అమ్మడు తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజా సంచలన కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఆర్ సి15లో చేస్తోంది ఈ అమ్మడు.
తాజాగా అంజలి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
కొన్నిసార్లు రొమాంటిక్ సీన్స్ లో నటించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ సినిమా కోసం తప్పదు..
అలంటి సమయంలో చాలా ఇబ్బందిపడేదాన్ని.. ‘కొన్నిసినిమాల్లో పాత్రకు తగ్గట్లు ముద్దుసీన్లలో నటించాల్సి వస్తుంది.
మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బందే అని తెలిపింది.కానీ సినిమాలో సీన్ కోసం నటించాల్సి వస్తుంది
అలాగే ఇక కొన్నిసార్లు ఇంటిమేట్ సీన్లలో నటించినప్పుడు తట్టుకోలేక క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది .