సోషల్ మీడియా విస్తృతి పెరిగాక సెలబ్రిటీలపై రూమర్స్ బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సినిమా తారలు ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హీరో/హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారంటూ నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిని కొందరు చూడకుండా వదిలేస్తే మరికొందరు మాత్రం స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
ఇటీవల స్టార్ యాంకర్ శ్రీముఖికి పెళ్లి కుదిరిందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు బాగా వైరలయ్యాయి. బుల్లితెర రాములమ్మకు ఫలానా వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అని, అతను హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మెన్ అని నెట్టింట్లో రూమర్స్ హల్‌చల్ చేశాయి.
చివరకు ఇవి శ్రీముఖి చెవిన పడడంతో ఫైర్ అయిపోయంది. ‘ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటారు.. ఇంకోసారి పెళ్లి అంటారు. ఇప్పుడు ఏకంగా మా నాన్న ఫొటో బ్లర్ చేసి పెళ్లి రూమర్లు స్ప్రెడ్ చేశారు.. మరీ ఇంత ఘోరమా?
రోజూ ఇలాంటి వార్తలు విని తెగ విసుగొస్తుంది’‘నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఇంకా మూడు, నాలుగేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా.
అప్పుడు కూడా నేనే స్వయంగా ప్రకటిస్తాను. ఇప్పుడు మాత్రం నాకు పెళ్లి ఆలోచన లేదు. దయచేసి ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయద్దు’ గాసిప్ రాయుళ్లకు రిక్వెస్ట్ చేసింది శ్రీముఖి.
ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోందీ స్టార్ యాంకర్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో శ్రీముఖి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.