బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది అనసూయ భరద్వాజ్‌.

ఓవైపు బుల్లితెరపై  అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. 

తాజాగా మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం. 

మేడే సందర్భంగా అనసూయ లుక్‌ను రివీల్‌ చేశారు మేకర్స్. ఇది రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రను గుర్తుచేస్తుంది. 

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

సంతోష్‌ కట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్,సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

జూన్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది