ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు.. ఇలా చేతినిండా ఆఫర్లతో బిజిబిజీగా మారిపోయింది స్టార్‌ యాంకర్‌ అనసూయ

తన అందం, చలాకీతనంతో బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది.

అలా తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది. అందులో ‘నేను ఓ డిజాస్టర్‌తో బాధ పడుతున్నా..

నా గురించి నెగెటివ్‌గా మాట్లాడే వారిని అస్సలు లెక్కచేయను. వారి గురించి పట్టించుకోవకపోవడమే నా రుగ్మత’ అంటూ అసలు విషయం బయటపెట్టింది అనసూయ.

కాగా పలుమార్లు తన సోషల్‌ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ట్రోలింగ్‌ బారిన పడింది అనసూయ.

ఈ నేపథ్యంలోనే తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, ట్రోల్ చేసినా తాను లెక్కచేయనంటూ, తనకు తోచించే చేస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది అనసూయ